ETV Bharat / state

యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు

author img

By

Published : Sep 19, 2020, 9:49 AM IST

యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో శిల్ప కళా రూపాలు ఆకట్టుకుంటున్నాయి. భక్తి భావాలను ప్రదర్శిస్తున్నాయి. ఆలయం పైకప్పులో నీటి లీకేజీలు భవిష్యత్తులో రాకుండా ప్రాకారాలపై వాటర్ ప్రూఫ్ పనులు చేస్తున్నారు.

Impressive construction work on the Yadadri Temple at yadadri district
యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు
యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాదాద్రి పంచ నారసింహుల సన్నిధిని శిల్పకళా రూపాలతో తీర్చిదిద్దారు. మండప ప్రాకారంలోని కృష్ణశిల స్థూపాలపై ఆంజనేయ స్వామి, గరుడ ఆళ్వార్లు, త్రిలోక సంచారి, నారద మహర్షి, మహా విష్ణువు, నారసింహుని వివిధ రూపాలు, విష్ణుమూర్తి రూపాలు, శ్రీచక్రంతోపాటు శంకు తిరునామాలను చెక్కారు.

పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు శిల్పులు, ఇంజినీర్లు నిమగ్నమయ్యారు. ఈనెల 13న సీఎం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఆలయంలో నీటి లీకేజీల విషయంలో రాజీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఆలస్యం అయినా నాణ్యతలో రాజీ పడొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రధానాలయంలో అంతర్, బాహ్య ప్రాకారంపై వాటర్ ప్రూఫ్ పనులు కొనసాగుతున్నాయి. నీరు కారకుండా ప్రాకారం పైభాగంలో, ప్రూఫింగ్ రసాయనాలు, డంగు సున్నంతో పనులు చేపడుతున్నారు. అదే విధంగా ప్రధానాలయ బాహ్య, అంతర్ ప్రాకారాలు, మండపాలపై కృష్ణశిలతో తయారు చేసిన పద్మాలను అమర్చుతున్నారు.

ఇదీ చూడండి : అలాంటి కాల్స్, సందేశాలకు నేనూ బాధితుడినే: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.