రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో భక్తులకు హోమియో మందులు పంపిణీ చేశారు. సెవెన్ సీస్ ఆధ్వర్యంలో సుదీర్ఘ క్లినికల్ రీసెర్చ్‌లో అనుభవం కలిగిన వైద్యుడు మోహన్‌లాల్ శయన సహకారంతో అందుబాటులోకి తెచ్చిన హోమియో మందులను దేవస్థానంలో పంపిణీ చేశారు.
హైదరాబాద్‌కి చెందిన సెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మారుతి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత గుట్ట ఆలయ ప్రధాన అర్చకులు మాధవాచారి,అడ్మిన్ సూపరింటెండెంట్ శ్రావణ్, వి.సాయి కృష్ణ పాల్గొన్నారు.
దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న వేదపండితులు, అర్చకులు, ఉద్యోగులు, ఆలయ సిబ్బందికి.. ఈ హోమియో మందులు అందించారు.