యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో ఆటోలో తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అలాగే పిపల్ పహాడ్ గ్రామంలో కారులో తరలిస్తున్న లిక్కర్‌ను సీఐ వెంకటేశ్వర్లు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు వీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డబ్బు, అక్రమ మద్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి : ఎన్నికల ఏర్పాట్లపై రజత్‌కుమార్‌తో ముఖాముఖి