ETV Bharat / state

వైభవంగా "శ్రీ మహా కాళభైరవ" విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవాలు - బోధానంద గోఆశ్రమం

బోధానంద గోఆశ్రమంలో "శ్రీ మహా కాళభైరవ" విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆశ్రమ పీఠాధిపతి బోధానందస్వామి ఆధ్వర్యంలో పూజారులు మహాకాళభైరవ విగ్రహానికి జలాధివాసం, ధాన్యాధివాసం పూజలు వైభవోపేతంగా నిర్వహించారు.

వైభవంగా "శ్రీ మహా కాళభైరవ" విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవాలు

author img

By

Published : Oct 23, 2020, 7:30 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలోని స్వామి బోధానంద గోఆశ్రమంలో "శ్రీ మహా కాళభైరవ" విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మొదలైన ఉత్సవాలు విజయదశమి రోజున మధ్యాహ్నం జరిగే కాళభైరవ విగ్రహ ప్రతిష్ఠాపనతో ముగియనున్నాయి. ఆశ్రమ పీఠాధిపతి బోధానందస్వామి ఆధ్వర్యంలో పూజారులు మహాకాళభైరవ విగ్రహానికి జలాధివాసం, ధాన్యాధివాసం పూజలు వైభవోపేతంగా నిర్వహించారు.

వైభవంగా
వైభవంగా "శ్రీ మహా కాళభైరవ" విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవాలు

మహాకాళభైరవ విగ్రహాన్ని పూర్తిగా కృష్ణశిలతో చేపించామన్నారు బోధానందస్వామి. ఇవాళ మొదలైన ప్రతిష్టాపన ఉత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. విజయదశమి రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీ మహాకాళభైరవ విగ్రహ ప్రతిష్ఠాపనతో ఉత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. గోసేవ, వృద్ధుల సేవతో ప్రారంభమైన ఈ ఆశ్రమ ప్రస్థానం భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక శక్తిపీఠంగా విరాజిల్లుతుందని బోధానందస్వామి వివరించారు.

ఇదీ చూడండి: మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.