యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌కు యాదాద్రి సమీపంగా ఉన్నందున... రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని మేయర్ తెలిపారు. యాదాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
ఇదీ చూడండి:- భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే