రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి జిల్లా శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. కొండపైనున్న హరిత భవనంలో లెక్కించారు. 15 రోజుల్లో స్వామివారికి రూ. 70 లక్షల 27 వేల 47 నగదు, 50.5 గ్రాముల బంగారం, కిలో 900 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.
ఈవో, ఆలయ అధికారుల పర్యవేక్షణ, కొవిడ్ నిబంధనలు పాటించి హండీ లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు.
ఇవీచూడండి: కిలో పాలు రూ.33... ఆ కథేంటి..?