ఘటన యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. సకాలంలో పంటను కొనుగోలు చేయకుండా.. నిర్వాహకులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల పక్షపాతి అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రాల్లో అన్నదాతలకు ఎదురవుతోన్న సమస్యలను తక్షణమే పరిష్కరిచాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. రైతులకు సకాలంలో డబ్బులు అందించాలన్నారు నేతలు. తమ ఇబ్బందులపై.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్ గౌడ్ వెంటనే స్పందించాలని రైతులు కోరారు.
ఇదీ చదవండి: రెండో దశలో వేగంగా పల్లెలను చుట్టుముడుతున్న కరోనా