ETV Bharat / state

కొవిడ్ వ్యాక్సిన్ భారత్​లో తయారవడం గర్వకారణం: దత్తాత్రేయ

యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ.. ఈ రోజు భువనగిరి చేరుకున్నారు. పట్టణంలో భాజపా కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కరోనా సంక్షోభంలో రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని దత్తాత్రేయ సూచించారు.

author img

By

Published : Dec 12, 2020, 1:16 PM IST

Updated : Dec 12, 2020, 1:37 PM IST

himachal pradesh governor bandaru datthatreya tour in yadadri district
హైదరాబాద్​ ఔషధ నగరి: బండారు దత్తాత్రేయ
హైదరాబాద్​ ఔషధ నగరి: బండారు దత్తాత్రేయ

హైదరాబాద్ ఔషధ నగరి అని, నగరం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ అభిప్రాయ పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా భువనగిరికి చేరుకున్న గవర్నర్​ బండారు దత్తాత్రేయకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో తన మిత్రుడు, జిల్లా భాజపా కార్యదర్శి నర్ల నర్సింగరావును కలిశారు. ఈ మధ్యనే వివాహమైన ఆయన కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించారు.

కొవిడ్​ వల్ల తన రాజకీయ జీవితంలో గానీ, ప్రజా జీవితంలో గానీ ఎప్పుడూ ఇంత నిర్బంధాన్ని ఎదుర్కోలేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో అందరూ ధైర్యంగా నిలబడాలని, కరోనా నియమాలను అందరూ పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ భారత్​లో తయారవడం దేశానికి గర్వకారణమని అన్నారు. కొవిడ్​ పైన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతతో ఉండి మరింత లబ్ధిపొందాలని బండారు దత్తాత్రేయ సూచించారు.

ఇదీ చదవండి: వసతిగృహాల్లో ఉండాలంటే కరోనా పరీక్ష తప్పనిసరి

Last Updated : Dec 12, 2020, 1:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.