యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు.
దర్శనానంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను అమర్నాథ్ గౌడ్ పరిశీలించారు. అధికారులను అడిగి పనుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో యాదాద్రిలోని పూర్వగిరి శ్రీ పాత లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అమర్నాథ్ గౌడ్ వెంట ఆలయ అర్చకులు, జిల్లా న్యాయస్థానం అధికారులు, భువనగిరి ఆర్డీవో, స్థానిక ఎమ్మార్వో తదితరులు ఉన్నారు.
ఇదీచూడండి.. ప్రశాంతంగా పాలిసెట్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన