Heavy current bill :యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ దుకాణ యజమానికి కరెంటు బిల్లుతో షాక్ తగిలింది. అదేంటి కరెంటు బిల్లు షాక్ కొట్టడం ఏంటని ఆలోచిస్తున్నారా.... ఆ బిల్లులో వచ్చిన మొత్తం చూస్తే ఎవరికైనా షాక్ కొట్టడం ఖాయం. ఎందుకంటే... నెలనెలా నాలుగైదు వందలు రావాల్సిన బిల్లు ఏకంగా రూ. 6 లక్షలకు పైగా వచ్చింది.
యాదాద్రి భువనగిరి బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో సొప్పరి రవి లేడీస్, గిఫ్ట్ కార్నర్ నడిపిస్తున్నాడు. రోజుకు మూడు, నాలుగు వందల గిరాకీ అవుతుంది. నెలనెలా నాలుగైదు వందలు కరెంటు బిల్లు వస్తుంది. కానీ ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు అక్షరాలా..... 6 లక్షల 46 వేల 360 రూపాయలు రావడం చూసి దుకాణ యజమాని రవి షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే భారీగా కరెంటు బిల్లు వచ్చిందని రవి అంటున్నారు. అధికారులు తన దుకాణ కరెంటు బిల్లును సరిచేసి ఇవ్వాలని కోరుతున్నాడు.
ఇదీ చదవండి: HYD Police saves life: శెభాష్ పోలీస్.. పోతున్న ప్రాణాన్ని నిలబెట్టారు..!