యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. లడ్డూ ప్రసాద కౌంటర్లు కిటకిటలాడాయి.
కొవిడ్ నిబంధనల ప్రకారం ఆలయంలో భక్తులకు... థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ చేసి క్యూ లైన్లోకి పంపిస్తున్నారు. భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్న ఆలయ అధికారులు... ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలకు వెళ్లేందుకు అనుమతివ్వడం లేదు.
ఇదీ చూడండి: దావూద్ మా దేశ పౌరుడు కాదు..!