అనుమానం పెనుభూతమై భర్త, అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తే.. భరించలేక యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు గ్రామానికి చెందిన పూజశ్రీ (25) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొన ఊపిరితో భర్త ఇంటివద్ద ఆందోళన చేపట్టి... మంగళవారం సాయంత్రం కన్నుమూసింది. మృతురాలు పూజశ్రీతోపాటు ఆమె రెండు నెలల మగబిడ్డకు న్యాయం చేయాలని పూజశ్రీ తల్లిదండ్రులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. అక్కడ కనిపించిన ఈ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది.
ఇదీ చూడండి: భర్త వేధింపులు తాళలేక వివాహిత మృతి