యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో పీహెచ్సీ డాక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల కో ఆర్డినేటింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో హెల్త్ సెక్రటరీ సయ్యద్ ముర్తుజా పాల్గొన్నారు.
డోర్ టూ డోర్ సర్వే ద్వారా గుర్తించిన బాధితులకు మెడికల్ కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆశాలు, ఏఎన్ఎంలు, డాక్టర్ల టీమ్ ద్వారా మండల అధికారులు నిరంతరాయంగా పర్యవేక్షించాలని తెలిపారు.
రెండోసారి జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చౌటుప్పల్ మండలం తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 13వేల ఇళ్లకు నిర్వహించిన సర్వేలో 534 మందికి కరోనా లక్షణాలు గుర్తించారు. అందులో 46 మందికి పాజిటివ్ రావడంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీ ఆదేశించారు.
ఇదీ చదవండి: 'మొల్నుపిరావిర్ విజయవంతమైతే కరోనా కట్టడిలో అత్యుత్తమ ఫలితాలు'