ఆరో విడత హరితహారంలో భాగంగా రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఐ సీహెచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలో మొక్కలు నాటారు. ఊరకుంట, కోమటికుంట కట్టపైన 380 ఖజ్జూర, ఈత మొక్కలను నాటారు.
హరితహారం కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యమిచ్చి పచ్చదనం పెంచడం కోసం అహర్నిశలు కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తోందని రామకృష్ణారెడ్డి తెలిపారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ కూడా వారే తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్