ETV Bharat / state

Harish Rao on New Schemes : 'త్వరలోనే సీఎం కేసీఆర్‌ కొత్త పథకాలను ప్రకటిస్తారు' - హైదరాబాద్​లో సెస్ వసతిగృహాన్ని ప్రారంభించిన హరీశ్

Harish Rao on New Schemes : యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా హరీశ్​రావు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజల కోసం మరిన్ని కొత్త పథకాలను తీసుకురాబోతున్నామని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త పథకాలను ప్రకటిస్తారని హరీశ్​రావు పేర్కొన్నారు.

Yadadri Bhuvanagiri District
Harish Rao
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 4:05 PM IST

Harish Rao on New Schemes in Telangana : యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి హరీశ్​రావు (Harish Rao) పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రామన్నపేట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత పాత బస్టాండ్ ఆవరణలో రూ.2.50 కోట్లతో చేపట్టనున్న.. పురాతన చెన్నకేశ్వర ఆలయం నిర్మాణంకు హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీగా రామన్నపేట (Ramannapet) ఏరియా ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న ఆయన.. రూ.5.5 కోట్లతో నిర్మించనున్న నూతన ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేశారు.

Harish Rao Fires on Congress : 'బీఆర్​ఎస్ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్‌ చెబుతున్న అబద్దాలకు పోటీ'

Harish Rao Yadadri Bhuvanagiri District Tour : ఈ క్రమంలోనే ఆశా కార్యకర్తలు హరీశ్​రావుకు.. ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం రూ.25 లక్షలతో ఆధునికరించిన ఉపకోశాధికారి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ సర్కార్.. రాష్ట్ర ప్రజల కోసం నూతన సంక్షేమ పథకాలను తీసుకురాబోతుందని హరీశ్​రావు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే వాటిని ప్రకటిస్తారని చెప్పారు. రామన్నపేట ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి ఇప్పుడు కేటాయించిన రూ.5.5 కోట్లకు అదనంగా.. మరో రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రామన్నపేట చెరువు కట్ట, కాలువ నిర్మాణానికి రూ.4 కోట్లు కేటాయించనున్నట్లు హరీశ్​రావు పేర్కొన్నారు.

Harishrao on Jamili Elections : 'జమిలి వచ్చినా.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్​ఎస్​దే'

Harish Rao Laid Foundation Stone Many Development projects in Ramannapet : నకిరేకల్​లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.35 కోట్లు ఇప్పటికే కేటాయించామని.. త్వరలోనే పనులు పూర్తవుతాయని హరీశ్​రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుక్షణం అభివృద్ధి గురించే ఆలోచిస్తారని.. నకిరేకల్‌ ఎమ్మెల్యేగా మళ్లీ తననే గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, రైతుబంధు , దళితబంధు లాంటి పథకాలు ప్రజలకు, రైతులకు అందుతున్నాయని హరీశ్​రావు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్​రెడ్డి, నకిరేకల్​ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

"ప్రజల కోసం మరిన్ని కొత్త పథకాలను తీసుకురాబోతున్నాం. త్వరలోనే సీఎం కేసీఆర్‌ కొత్త పథకాలను ప్రకటిస్తారు. రామన్నపేట ఏరియా ఆసుపత్రికి అదనంగా మరో రూ.10 కోట్లు. రామన్నపేట చెరువు కట్ట, కాలువ నిర్మాణానికి రూ.4 కోట్లు అందిస్తాం. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుక్షణం అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. నకిరేకల్‌ ఎమ్మెల్యేగా మళ్లీ చిరుమర్తి లింగయ్యనే గెలిపించాలి." - హరీశ్‌రావు, మంత్రి

Harish Rao Inagruation Cess Hostel in Hyderabad : అంతకుముందు ప్రభుత్వ విధానాలు, పథకాల రూపకల్పనలో సామాజిక అధ్యయనాలు ఎంతో అవసరమని మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్.. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల అధ్యయనాలు చేస్తూ.. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి విలువైన సూచనలు చేస్తోందన్నారు. హైదరాబాద్‌ బేగంపేట్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ - సెస్‌లో ఏర్పాటు చేసిన విద్యార్థినుల వసతిగృహాన్ని (Cess Hostel) ఆయన ప్రారంభించారు.

Harish Rao Latest Comments : వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 సీట్లు గెలుస్తుంది: హరీశ్​రావు

రూ.5 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో వసతిగృహ నిర్మాణం చేపట్టినట్టు హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సెస్‌ను ఎంతగానో ప్రోత్సహిస్తోందన్నారు. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రమైనా పురోగతి చెందుతుందని చెప్పారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ పాలసీలు సామాజిక పరిస్థితుల ఆధారంగా కల్పన చేయాల్సి ఉంటుందని.. అప్పుడే అవి అనుకున్న ఫలితాలు పేర్కొన్నారు. ఈ దిశగా సెస్ ప్రభుత్వానికి వెన్నెముకగా పనిచేస్తోందని హరీశ్​రావు కితాబిచ్చారు.

Harish Rao on New Schemes త్వరలోనే సీఎం కేసీఆర్‌ కొత్త పథకాలను ప్రకటిస్తారు

Mulugu Medical College Foundation Stone : 'తెలంగాణ ఏ రంగంలో చూసినా ప్రథమ స్థానంలో ఉంది'

Minister Harish Rao Reaction on Congress 6 Guarantees : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు కాదు.. ఆర్నెళ్లకో సీఎం వస్తారు: మంత్రి హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.