యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కరోనా బాధితులకు నిత్యావసర సరకులు అందజేశారు. కరోనా వ్యాప్తి తీవ్రతరమవుతున్న దృష్ట్యా బాధితులు త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో వారికి పౌష్టికాహారం, నిత్యావసర సరకులు పంపిణీ చేశామని తెలిపారు.
తుర్కపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు 300 కుటుంబాలకు చెందిన బాధితులందరికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నేత కల్లూరి రామచంద్రారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేశ్, మండల కాంగ్రెస్ నేత పత్తిపాటి హన్మంతరావు తదితర నాయకులు పాల్గొన్నారు.