విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు దాసి శంకర్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మూఢనమ్మకాలు అభివృద్ధి నిరోధకాలనీ.. విద్యార్థి దశ నుంచే వాటికి వ్యతిరేకంగా పోరాడి విజ్ఞాన సమాజాన్ని నిర్మించాలని సూచించారు. ప్రతి విద్యార్థి సామాజిక చైతన్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జె.వి.వి. జిల్లా ఉపాధ్యక్షులు భాస్కరాచారి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.