కార్తీకమాసం మొదటి శుక్రవారం సందర్భంగా యాదాద్రిలో ఆరాధనలు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి తులసీ పత్రాలతో అర్చనలు జరిపారు .
సాయంత్రం బాలాలయంలో ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఊంజల్ సేవ నిర్వహించారు.
మంత్రోచ్ఛారణల మధ్య ఉంజల్ సేవ మహోత్సవం కోలాహలంగా జరిగింది. ప్రత్యేకంగా బంగారంతో తయారుచేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి అర్చన చేశారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయంలో ముఖమండపంలోని ఉయ్యాలలో ఉంచారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చూడండి: వేద మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం