భువనగిరి జిల్లా ఏరియా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో వైద్యుల, నర్సుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీబీనగర్ ఎయిమ్స్, భువనగిరి ఏరియా ఆస్పత్రిని ఆయన సందర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరిచి వైద్యం అందించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం వైద్యరంగానికి ఐదు వేల కోట్లు కేటాయించాలని ఆయన కోరారు.