ETV Bharat / state

పిల్లలు నల్లగా పుడతారని గర్భిణులు ఐరన్ మాత్రలను పడేస్తున్నారు: తమిళిసై - బీబీనగర్ ఎయిమ్స్​ వార్తలు

Governor Tamilisai visit Bibinagar AIIMS : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్​ను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందర్శించారు. 2021 - 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోర్ట్ సెర్మని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎయిమ్స్ అధికారులు బీబీ నగర్ ఎయిమ్స్ ప్రగతి రిపోర్ట్​ను వీడియో ద్వారా వివరించారు.

Governor Tamilisai
Governor Tamilisai
author img

By

Published : Mar 12, 2022, 5:20 PM IST

Governor Tamilisai visit Bibinagar AIIMS : కేంద్రప్రభుత్వం వైద్య విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ ఎయిమ్స్‌ని ఆమె సందర్శించారు. 2021 - 2022 ఎంబీబీఎస్​ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోర్ట్ సెర్మని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులకు వైట్ కోట్‌ను ధరింపజేశారు. ఎయిమ్స్ అధికారులు బీబీ నగర్ ఎయిమ్స్ ప్రగతి నివేదికను వీడియో ద్వారా వివరించారు. భవిష్యత్‌లో బీబీ నగర్ ఎయిమ్స్ ఎలా రూపొందనుందో వీడియో ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ తమిళిసై వీక్షించారు.

రోగులతో ఎక్కువ మాట్లాడాలి..

తన అనుభవాలను వైద్య విద్యార్థులతో గవర్నర్ తమిళిసై పంచుకున్నారు. తన భర్త నెఫ్రాలజిస్ట్ అని, తాను గైనకాలజిస్ట్​ అని వెల్లడించారు. గర్భిణిలు ఐరన్ మాత్రలు వేసుకుంటే మంచిదని... కానీ పుట్టే పిల్లలు నల్లగా అవుతారని వారు పడేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాళ్లకు అవగాహన కల్పించాలని సూచించారు. రోగులతో ఎక్కువ మాట్లాడాలని అన్నారు. వారు చెప్పే విషయాల ద్వారా ఎక్కువ నేర్చుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా రోగ లక్షణాల గురించి ఎక్కువ నేర్చుకోవాలని యువ వైద్యులకు సూచించారు.

పరిశోధనలు చేయాలి..

'వైద్య వృత్తిని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి. విద్యార్థులు చిన్న చిన్న పరిశోధనలు చేయాలి. దీనివల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఫెటల్ థెరపీ నేర్చుకోవడం కోసం నేను కెనడా వెళ్లాను. వైకల్యం ఉన్న పిల్లలకు ఇది ఉపయోగపడుతుంది. విపత్కర పరిస్థితుల్లోనూ వైద్య విద్యార్థులకు పాఠాలు బోధించిన బీబీ నగర్ ఎయిమ్స్ సిబ్బందిని అభినందిస్తున్నా.' - తమిళిసై సౌందరరాజన్​, గవర్నర్​

చిన్న వయసులో గవర్నర్​గా..

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలని గవర్నర్​ అన్నారు. వైద్య విద్యకు కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని... ఇది అతిపెద్ద ఇన్సూరెన్స్ ప్రోగ్రామని వెల్లడించారు. తాను తెలంగాణతో పాటు పుదుచ్చేరికి కూడా గవర్నర్​గా పని చేస్తున్నానని తెలిపారు. చిన్న వయసులో గవర్నర్​ను అయ్యానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : జీహెచ్ఎంసీ అధికారులపై 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు.. ఎందుకంటే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.