ETV Bharat / state

ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ - gongidi sunitha reddy launches free police training camp news

ఆలేరు పట్టణ కేంద్రంలో​ ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతోనే సెంటర్​ మంజూరైందని తెలిపారు. ఈ ఉచిత శిక్షణ ద్వారా పోలీస్​తోపాటు ఆర్మీ ఉద్యోగాలకు కూడ సన్నద్ధం కావాలని అభ్యర్థులకు ఆమె సూచించారు.

Government whip gongidi sunitha reddy launches free police training camp
ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
author img

By

Published : Jan 20, 2021, 4:35 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పోలీస్ ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచిత శిక్షణ​ తరగతులని ప్రారంభించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతోనే సెంటర్​ మంజూరైందని తెలిపారు.

ఈ ఉచిత శిక్షణ ద్వారా పోలీస్​తోపాటు ఆర్మీ ఉద్యోగాలకు కూడ సన్నద్ధం కావాలని ఆమె అభ్యర్థులకు సూచించారు. మూడు నెలలు కష్టపడితే ఉద్యోగం సాధించవచ్చన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణ కోసం పీఈటీలు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ వస్పరి శంకరయ్య, యాదగిరిగుట్ట రూరల్ సీఐ నర్సయ్య, ఆలేరు పట్టణ ఎస్​ఐ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రేమ.. పెళ్లి.. కౌన్సెలింగ్.. లొల్లి.. హత్య.. ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.