ఈ నెల 10న నల్గొండ జిల్లా హాలియాలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలొచ్చి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కోరారు. ఆలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అనేక రంగాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు.
చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి పది జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిపారు. నల్గొండపై ఉన్న ప్రేమతో మొదటి సభను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత హాలియాలో నిర్వహించే బహిరంగ సభకు... నియోజకవర్గం నుంచి 20వేల మంది తరలివెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ