యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో టెస్కాబ్ వైస్ ఛైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పీఏసీఎస్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయనకు గ్రామస్థులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
గత 35 ఏళ్లుగా వంగపల్లి పీఏసీఎస్ ఛైర్మన్గా చేసిన సేవలు గుర్తించి తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ ఛైర్మన్గా నియమించినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు మహేందర్ రెడ్డి. సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తూ.. రైతులకు అందాల్సిన సబ్సిడీలు అందేలా చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: వీసా ఆంక్షలపై సమాచారం కోసం అమెరికాలో హెల్ప్లైన్లు