ETV Bharat / state

700 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - 700 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో తెరాస ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్​ గొంగిడి మహేందర్​ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు తెరాస నేతలు, ప్రజా ప్రతినిధులు కలిసి పేదలకు నిత్యావసర సరుకులు అందించారు.

Gongidi Mahender Reddy Distributes Groceries For 700 Families
700 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 21, 2020, 5:05 PM IST

Updated : May 21, 2020, 5:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కూరెళ్ల గ్రామంలో తెరాస నేతలు 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 10వేల కోడిగుడ్లు పంచారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్, టీఎస్ క్యాబ్​ వైస్​ ఛైర్మన్​ గొంగిడి మహేందర్​ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా డీఎల్​డీఏ ఛైర్మన్​ మోతె పిచ్చిరెడ్డిల చేతుల మీదుగా పేదలకు సరుకులు అందించారు.

లాక్​డౌన్​ పరిస్థితుల్లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కరోనా నుంచి రక్షించుకోవాలంటే.. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తెరాస నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మాస్క్​తో మార్నింగ్​ వాక్​.. చాలా డేంజర్​!

Last Updated : May 21, 2020, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.