యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక భైరామ్నగర్లో శ్రీఅభయాంజనేయ స్వామి, విఘ్నేశ్వర, కార్తికేయ, జీవధ్వజ, శిఖర ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పురోహితులు పాండురంగ శాస్త్రీ, ప్రభుత్వ ఆగమ, సలహాదారులు సుబ్రహ్మణ్య సిద్ధాంతి, వేదపండితులు, బుుత్వికులు ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
కొలనుపాక వీరనారయణ స్వామి టెంపుల్ నుంచి హనుమాన్ సేవ సమితి సభ్యులు బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మహా పూూర్ణాహుతి,హోమము, మంగళహారతి, తీర్థప్రసాదాలు వినియోగం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు నంద పూలమ్మ-మల్లేశం, మాధవి-సంతోష్ కూమార్, శ్రీహనుమాన్ అసోసియేషన్, గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్మీ ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్, అంజయ్య, విఠల్ గౌడ్, భక్తులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జలకళతో చెరువులు.. ఆకర్షిస్తున్నమత్తడి సోయగాలు...