ETV Bharat / state

gaddar visit yadadri : యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రజా గాయకుడు - యాదాద్రిలో భక్తుల రద్దీ

gaddar visit yadadri : ప్రకృతే గొప్ప దైవమని, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ప్రజా గాయకుడు గద్దర్​ అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. గద్దర్​తో పాటు ఎమ్మెల్సీ సురభివాణి సహా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.

gaddar
gaddar
author img

By

Published : Dec 19, 2021, 10:24 PM IST

gaddar visit yadadri: ప్రజాగాయకడు గద్దర్​... కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరకున్నట్లు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదం అందించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని పీడీ యాక్ట్ ట్రైబ్యునల్ ఛైర్మన్​ భాస్కర్ రావు దర్శించుకున్నారు.

యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రజా గాయకుడు

గద్దర్​ నోట యాదాద్రీశుడి పాట..

'మా నరసన్న ఓ నర్సన్న.. యాదగిరి నరసన్న మా బీదోళ్లను.. సల్లంగా చూడు నో మాయన్న మా నర్సన్న... యాదగిరి నరసన్న నీవు కొండల్లో దాగి ఉండి... కోటి మొక్కులు తీర్చే దేవుడ వంటరో నరసన్న మా నరసన్న... నీవు యాదాద్రి వైనావు యాది మరచిపోకు అన్నో మా నరసన్న....' అని స్వామివారిని స్మరించుకుంటూ పాట పాడారు.

స్వామివారి సేవలో ఎమ్మెల్సీ సురభివాణి

లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సురభివాణి కుటుంబం

mlc surabhi vani visit yadadri : యాదాద్రీశుడిని ఎమ్మెల్సీ సురభివాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదగిరి గుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. తిరుమల తరహాలో యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సీఎం కేసీఆర్​కు ఎమ్మెల్సీ సురభివాణి కృతజ్ఞతలు తెలిపారు. లాభాపేక్షలేకుండా యాత్రా ప్రదేశాల్లో నిత్యాన్నదాం ఏర్పాటు చేస్తున్న సత్రం నిర్వాహకులను అభినందించారు.

యాదాద్రిలో తెలంగాణ షీప్​అండ్​ గోట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఛైర్మన్​

యాదాద్రీశుడి సన్నిధిలో షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్​

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్​ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదాద్రి ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.

పోటెత్తిన భక్తులు

యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు
యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు

ఆదివారం సెలవు కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు, ఆలయ భద్రత దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.

ఇదీ చూడండి: Heavy Rush at Yadadri Temple: సండే స్పెషల్.. నారసింహుని సన్నిధిలో భక్తుల సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.