యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని పాత హైస్కూల్ స్థలం ఆవరణలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో యాదాద్రి పీహెచ్సీ వైద్య బృందం పట్టణ ప్రజలకు ఉచితంగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. 93 మందికి పరీక్షలు చేయగా.. 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
తాజా కేసుల్లో యాదగిరిగుట్టలో 6, యాదగిరిపల్లిలో 1, గుండ్లపల్లిలో 2, మాసాయిపేటలో 2, మల్లపురంలో 1, గౌరాయిపల్లిలో 1, వడాయిగూడెంలో 2 కేసులు నమోదయ్యాయి.
ఈ సందర్భంగా ఉచితంగా కరోనా పరీక్షలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదాద్రి పీహెచ్సీ వైద్య బృందానికి మున్సిపల్ ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, మున్సిపల్ ఛైర్మన్ సుధా-హేమెందర్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. రెండు ఎమ్మెల్సీ స్థానాలపై తెరాస గురి.. పార్టీ శ్రేణుల సమాయత్తం