తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈనెల మూడున స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పదిన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి.
నాలుగో రోజైన నేడు స్వామి వారికి హావనం, హోమం, తిరుమంజనం వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని హనుమంత వాహన సేవపై నయనానందకరంగా అలంకరించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చూడండి: సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ