యాదాద్రి భువనగిరి జిల్లాలోని అటవీశాఖ సిబ్బంది.. జిల్లాలోని అటవీశాఖ క్షేత్రాధికారి కార్యాలయం నుంచి స్థానిక వినాయక్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సారసాలలో అటవీశాఖ అధికారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అటవీ భూములను పరిరక్షిస్తూ.. నిబద్ధతతో పనిచేస్తూ.. ఆదివారం కూడా విధులకు హాజరవుతున్న తమపై దాడి చేయడం హేయమైన చర్య అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండిః భారీ బందోబస్తు మధ్య మొక్కలు నాటిన అధికారులు