ETV Bharat / state

యాదాద్రిలో జాలరులకు చిక్కిన వింత చేప

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని మంగలిగడ్డ వద్ద చేపలు పడుతుండగా జాలరులకు ఓ వింత చేప చిక్కింది. ఈ మత్స్యాన్ని డెవిల్ ఫిష్‌గా పిలుస్తుంటారని, ఇది ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని రైతులు తెలిపారు.

Fishermen found a strange fish
యాదాద్రిలో జాలరులకు దొరికిన వింత చేప
author img

By

Published : May 21, 2021, 6:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జాలరులకు వింత చేప చిక్కింది. మంగలిగడ్డకు చెందిన జింకల యాకయ్య అనే రైతు.... తన వ్యవసాయ బావిలో వల వేయగా.. ఈ చేప చిక్కింది. చేపపై నల్లటి మచ్చలు, ముళ్లు ఉన్నాయి. చేపకు కింది బాగంలో నోరు ఉంది. సుమారు అరకేజీపైగానే బరువు ఉంది. ఇలాంటి చేపను గతంలో ఎప్పుడు చూడలేదని యాకయ్య తెలిపారు.

Fishermen found a strange fish
వింత చేప నోటి భాగం
Fishermen found a strange fish
డెవిల్ ఫిష్‌

తన వ్యవసాయ భూమిలోంచి దేవాదుల కాల్వ వెళ్తుందని... అందులోంచి వచ్చి ఉంటుందని చెప్పారు. ఈ వింత చేపను... డెవిల్‌ ఫిష్‌గా పిలుస్తారని యాకయ్య వివరించారు. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని... తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్‌ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని యాకయ్య తెలిపారు.

Fishermen found a strange fish
జాలరులకు దొరికిన చేప

ఇదీ చదవండి: విదేశాల్లో కొవాగ్జిన్​ టీకా ఉత్పత్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.