యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పర్యటనకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి యాదాద్రిలో నిరసనల సెగ తగిలింది. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు తమ పొట్ట మీద కొట్టడమే అని.. తమకు అన్యాయం చేయొద్దంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రి కాళ్ల మీద పడ్డారు. అనంతరం మంత్రికి వినతి పత్రం ఇచ్చారు.
ఇదీ చదవండి: గుడ్న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్!