యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 29 నుంచి 31 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు కారంపూడి లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఇందుకు బాలాలయంలో యాగశాల, పందిరితోపాటు ఇతర ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.
బుధవారం సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేసి రెండు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తామని తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, ఆన్‌లైన్ పూజలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 29 నుంచి 31 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా