ETV Bharat / state

రైతు బంధనాలు: అన్నదాతకు అందని సాయం!

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం నీరుగారిపోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 11 వేల మంది రైతులకు ఖరీఫ్​లో అందాల్సి రైతుబంధు సాయం ఇప్పటికీ అందలేదు.

raithubandhu problems
సర్కారు సాయం కోసం అన్నదాతల ఎదురుచూపులు
author img

By

Published : Feb 22, 2020, 6:16 PM IST

సర్కారు సాయం కోసం అన్నదాతల ఎదురుచూపులు

యాసంగి నాట్లు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో వరి కోతకు వస్తుంది. అయినా.. అధికారులు మాత్రం కిందటి ఖరీఫ్​కు సంబంధించిన రైతుబంధు సాయం ఇప్పటికీ ఇవ్వలేదు. ఏ ఒక్కరో.. ఇద్దరో.. సాంకేతిక లోపం వల్ల రైతుబంధు అందుకోలేక పోయారంటే.. ఎక్కడో.. ఏదో పొరపాటు జరిగిందని అనుకోవచ్చు. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా 87 వేలమందికి పెట్టుబడి సాయం ఇంకా అందలేదు. వీరందరి పేర్లను ట్రెజరీలో నమోదు చేశారు. ఇందులో.. ఆలేరు నియోజక వర్గంలోని ఎనిమిది మండలాల్లో 11 వేల 925 మంది రైతులకు గత ఖరీఫ్ పెట్టుబడి సాయం అందలేదు. కొంతమందికి యాసంగి సీజన్ పెట్టుబడి సాయం అందినా.. గత ఖరీఫ్​లో రైతుబంధు అందని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.

నియోజకవర్గంలో ఖరీఫ్ 'రైతుబంధు' తీరు

మండలం రైతులు జమ అయిన నగదుఅందనివారు
ఆలేరు 9,9287, 127 1,343
గుండాల 10,9132,964 5,328
రాజపేట 11,6438,845 1,069
తుర్కపల్లి 11,775 9,135 755
ఆత్మకూరు(ఎం) 11,362 8,748 1,230
బొమ్మలరామారం 11,617 8,570 690
మోటకొండూర్ 9,060 7,187839
యాదగిరిగుట్ట 10,720 7,558 671

ఖరీఫ్ రైతు బంధు అందేనా..?

రైతుబంధు పథకంలో ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సొమ్ముగా ఇవ్వగా... జూన్ 1 నుంచి ఎకరానికి మరో వెయ్యి పెంచింది. రైతు బంధు పథకం ప్రభుత్వానికి భారంగా మారడం వల్ల ఇందులో కొన్ని మార్పులు చేయాలని సంకల్పించింది. రైతుబంధు పథకాన్ని గరిష్ఠంగా 10 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఖరీఫ్​కు సంబంధించి ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి మాత్రమే రైతుబంధు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది.

అధికారుల వివరణ...

10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఖరీఫ్​కు సంబంధించి రైతుబంధు సాయం తప్పనిసరిగా అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ రైతుబంధు సాయంకి సంబంధించి అర్హులైన రైతుల వివరాలు ట్రెజరీలో అప్​లోడ్ చేసి ఉన్నాయని రైతులు ఆందోళని చెందవద్దని అంటున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని భరోసా ఇస్తున్నారు.

అన్నదాతల అప్పులు తీరేనా...?

తమకున్న కొద్ది పొలానికి రైతుబంధు సాయం అందుతుందా లేదా అని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్​లో అప్పులు చేసి పంట పండించినా... సరైన మద్దతు ధర లేక సర్కారు సాయం లేక నానా ఇబ్బందులు పడ్డారు. యాసంగిలో మళ్లీ వరి పంట సాగు చేశారు. ఇప్పటివరకూ.. ఖరీఫ్, యాసంగి రెండు సీజన్​లకు సంబంధించిన రైతుబంధు సాయం అందలేదని రైతులు వాపోతున్నారు. అప్పులు తీరాలన్నా, పంటకు మందులు చల్లాలన్నా ప్రభుత్వ సాయమే దిక్కని చేతిలో ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేదని ఆందోళన చెందుతున్నారు ఆలేరు రైతులు.

ఇవీ చూడండి: "పద్మ అవార్డు గ్రహీతలు చూపిన మార్గం అనుసరణీయం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.