ETV Bharat / state

మోత్కూరులో కంది రైతులపై హమాలీల దాడి

కందుల అమ్మకానికి వచ్చిన రైతులపై హమాలీలు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో చోటు చేసుకుంది.

farmers protest against the hamalies in yadadri bhuvanagiri motkuru
మోత్కూరులో కంది రైతులపై హమాలీల దాడి
author img

By

Published : Mar 3, 2020, 9:38 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో కందులు అమ్మడానికి వచ్చిన రైతులపై హమాలీలు దాడి చేశారు. కందులను లారీలోకి ఎత్తే సమయంలో హమాలీలు తమకు విధిగా మామూలు ఇవ్వాలని అడగడం వల్ల రైతులకు, హమాలీలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనితో రైతులపై ఒక్కసారిగా హమాలీలు దాడి చేశారు.

ఆగ్రహించిన రైతులు దాడికి పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించాలంటూ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదురుగా.. భువనగిరి-మోత్కూరు రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అధికారులు కలుగజేసుకుని దాడికి పాల్పడిన వారిని సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల స్పందనతో రైతులు నిరసన విరమించారు.

మోత్కూరులో కంది రైతులపై హమాలీల దాడి

ఇవీ చూడండి: హైదరాబాద్‌లో కరోనా కేసు... రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.