యాాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటారు గ్రామంలో 70ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాపాసుపుస్తకాలు ఇవ్వకపోడవం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. మాటారు నుంచి మోటకొండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
332 సర్వే నంబర్లోని 78 ఎకరాల 33 గుంటల భూమిని ఎన్నోఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న 93 దళిత కుటుంబాలకు వెంటనే నూతన పాస్‌బుక్‌లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గతంలోనూ ఈ భూమి విషయమై ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసికెళ్లామని.. అయినా ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదని బాధితులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాస్‌పుస్తకాలు ఇవ్వాలని లేని ఎడల పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు, జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్, తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఫార్మాసిటీకి ఆటంకాలు.. ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస