మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెగూడెంలో తెరాస నేత యాకుబ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా మోత్కూరులోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నుంచి పడ్డాడు.
అతన్ని చూసిన నర్సయ్య కారును ఆపి, అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల తన కారులోనే ఆ వ్యక్తిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల గాయపడిన వ్యక్తి కాలుకు నర్సయ్యగౌడ్ చికిత్స చేసి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ముందుగా తాను డాక్టర్‌నని, తర్వాతే రాజకీయ నాయకుడిని అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : 'పైవంతెన'పై మరో ప్రమాదం... గాల్లో కారు పల్టీ