లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు యాదాద్రి మున్సిపాలిటీలో బెంగళూరుకు చెందిన 'ఎస్తా' అనే స్వచ్ఛంద సంస్థ కూరగాయలను పంపిణీ చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నియమాలను పాటించాలని తెలిపారు. అత్యవసరంగా బయటకు వస్తే మాస్కులను ధరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సుధా, సంస్థ తెలంగాణ ఇంఛార్జి గిరివేని పవన్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు కూరగాయల పంపిణీ - ఎస్తా స్వచ్ఛంద సంస్థ
లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకోవటానికి దాతలు ముందుకొస్తున్నారు. యాదాద్రిలో 'ఎస్తా' అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు.