యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలక సంఘంలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ విడుదల దగ్గరనుంచి నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా తయారు చేయటం, ఎన్నికలు నిర్వహించడం లాంటి ప్రతి అంశాలపైనా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భువనగిరి ఇంఛార్జీ కమిషనర్‌తో పాటు ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః రైలు నుంచి జారిపడి... పేగులు అదిమిపట్టుకుని...