ETV Bharat / state

ఆ జిల్లాలో 47 మంది ప్రజాప్రతినిధులపై ఎన్నికల సంఘం వేటు - The state election commission disqualified 47 people

ఎన్నికల్లో పోటీ చేయగానే బాధ్యత తీరిపోదు. ఎన్నికల ఖర్చుల తాలూకు లెక్కలు చెబితేనే ఆ ప్రక్రియ ముగిసినట్లు. ఆ... ఏముందిలే! ఎవరొచ్చి అడుగుతారులే! అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అలాంటి భావనతో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల వ్యయ వివరాలు అందజేయని ఫలితంగా 47 మందిపై అనర్హత వేటు పడింది.

Election Commission has disqualified 47 public representatives from Yadadri district
ఆ జిల్లాలో 47 మంది ప్రజాప్రతినిధులపై ఎన్నికల సంఘం వేటు
author img

By

Published : Jan 6, 2021, 10:58 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రెండు మండలాలకు చెందిన 47 మంది ప్రజా ప్రతినిధులపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల మేరకు ఎన్నికల ఖర్చులు సమర్పించని కారణంగా ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా వెల్లడించారు.

బీబీనగర్ మండలంలోని 43 మంది వార్డు సభ్యులు, సంస్థాన్​ నారాయణపురం మండలంలోని నలుగురు వార్డు సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.