యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సందర్శించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూదాత మద్ది నారాయణ రెడ్డి, మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, సంస్థాన్ నారాయణపురం జడ్పీటీసీ బొల్ల శివశంకర్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
- ఇదీ చూడండి : నీటి సంక్షోభం: తమిళనాడు ఆలయంలో మంత్రి పూజలు