ETV Bharat / state

నారసింహుని పుణ్యక్షేత్రంలో తాగునీటి కష్టాలు - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికొచ్చే భక్తులకు... కొండపైన తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. లాక్​డౌన్​ వల్ల కొండపైన దుకాణాలు తెరవకపోవడం వల్ల.. ఆలయ అధికారులు... ఆ విషయం విస్మయించడం వల్ల తాగునీరు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

drinking water problem at yadadri
నరహరి.... దాహాం తీరే దారేది?
author img

By

Published : Jun 15, 2020, 1:16 PM IST

భక్తి దాహంతో దైవ దర్శనానికి వచ్చిన వారికి తాగు నీటి దాహం వెంటాడుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో తాగునీటి వసతి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైన ఉన్న ఒకే ఒక కొళాయి చాలా మందికి కనబడకుండా ఉంది. చూసిన వారెవరైనా నీరు తాగుదామని వెళ్తే అపరిశుభ్రంగా ఉండడం వల్ల తాగడానికి జంకుతున్నారు.

లాక్​డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఈనెల ఎనిమిది నుంచి యాదాద్రికి భక్తుల రాక మొదలైంది. పరిమిత సంఖ్యలో ఆటోలు, బస్సుల్లో, కొండ పైకి చేరుతున్నారు. చాలా మంది ఘాట్​రోడ్డులో నడుచుకుంటూ వస్తున్నారు. తడారిపోయిన గొంతు తడుపుకుందామంటే చుక్కనీరు దొరకని పరిస్థితి. లాక్​డౌన్​కు ముందు కొండ పైన దుకాణాల్లో శీతల పానీయాలు, మంచి నీళ్ల బాటిళ్లు విక్రయించేవారు. ప్రస్తుతం దుకాణాలు తెరవకపోవడం వల్ల కొండపైన నీరు దొరకని పరిస్థితి. కొండపైన తాగునీటి వసతి కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

అధికారులేమంటున్నారు

క్యూ లైన్​లో నల్లాలు ఉన్నాయని... వాటికి మరమ్మతులు చేసి భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఆలయ ఈవో గీతా రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.