యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి 95 గ్రాములు, అమ్మవారికి 32 గ్రాముల విలువ గల బంగారు కిరీటాలను హైదరాబాద్ కు చెందిన దాతలు బహుకరించారు. యాదాద్రి నారసింహునికి, ఉత్సవ విగ్రహాలకు, బంగారు కిరీటాలు, వెండి శఠగోపాన్ని అందజేశారు.
హైదరాబాద్ కు చెందిన నేలంటి జయమ్మ కుమారుడు, బాలాజీ గుప్తా కుటుంబ సభ్యులు కానుకలను బహుకరించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు, బంగారు కిరీటాలు, ఆలయ ఈఓ గీతారెడ్డి సమక్షంలో వారికి అందజేశారు.