లాక్డౌన్ నేపథ్యంలో యాదగిరిగుట్ట పరిధిలో విధులు నిర్వహించే హోమ్ గార్డ్ సిబ్బందికి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జోన్లో ఉన్న 142 మంది హోమ్ గార్డ్ సిబ్బందికి నిత్యావసరాలను అందజేశారు.
కొవిడ్-19లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు సూచించారు. భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని నారాయణరెడ్డి పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది అందరు ఆరోగ్యంగా ఉండాలని వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
ఇదీ చూడండి: తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు