ETV Bharat / state

Diesel from Plastic Waste : పనికి రాని ప్లాస్టిక్‌తో డీజిల్ తయారీ.. ఎలా చేస్తున్నారో మీరూ చూసేయండి..! - ప్లాస్టిక్‌ నుంచి డీజిల్‌ తయారు చేసే సహస్ర కంపెనీ

Diesel from Plastic Waste : ఉన్నత చదువులు చదువుకుని ఒకరి కింద పని చేయడం ఏంటి..? తామే ప్రత్యామ్నాయంగా నలుగురికి ఉపాధి కల్పించాలని భావించారు నల్గొండకు చెందిన ఆ యువకులు. లండన్‌ వేదికగా చేసిన వారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు తిరిగి స్వదేశానికి వచ్చారు. పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉపాధి లక్ష్యంగా డీజిల్‌ తయారీ పరిశ్రమ స్థాపించారు. అది కూడా ఎందుకూ పనికి రాని ప్లాస్టిక్‌ నుంచి. ప్రభుత్వాల నుంచి గుర్తింపు, ప్రశంసలు సంపాదించుకున్నారు. ఇంతకీ ఎవరీ యువ వ్యాపారవేత్తలు? వారికి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ కథనంలో చూద్దాం.

Diesel Making from Plastic Waste
Diesel from Plastic Waste
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2023, 9:18 PM IST

Diesel from Plastic Waste పనికి రాని ప్లాస్టిక్‌తో డీజిల్ తయారీ ఎలాగో మీరూ చూసేయండి

Diesel from Plastic Waste : ఇంజినీరింగ్‌లో రాణించి మంచి ఉద్యోగాలు అందుకున్నారు ఈ యువకులు. కానీ పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆర్థిక కష్టాలు దాటి.. ఏళ్ల పాటు శ్రమించి ప్లాస్టిక్‌ వ్యర్థాలతో డీజిల్‌ తయారీ పరిశ్రమ ప్రారంభించారు. ప్రస్తుతం లాభాలతో ముందుకెళ్తూ.. అందరి ప్రశంసలు, మన్ననలు పొందుతున్నారు రంజిత్‌రెడ్డి, దినేశ్‌ రెడ్డి. ఈ యువకులు ఒకరు మెకానికల్‌, మరొకరు కంప్యూటర్‌ ఇంజినీర్‌. ఇద్దరూ లండన్‌లో మాస్టర్స్‌ చేశారు. అక్కడే ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. మాతృ భూమికి, పర్యావరణ రక్షణ, స్థానికులకు ఉపాధి కల్పించేలా ఏదైనా పరిశ్రమ స్థాపించాలని భావించారు. ఆ సమయంలోనే రీసైకిల్‌ చేయడానికి వీల్లేని మల్టీలేయర్‌ పాలిథిన్‌ వ్యర్థాలతో డీజిల్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమ గురించి తెలుసుకున్నారు.

ఏడుతోనే బడి బంద్​.. ప్లాస్టిక్, పాలిథీన్​తో పెట్రోల్.. లీటర్​కు 50కి.మీ మైలేజ్!

Diesel Making from Plastic Waste : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో 'సహస్ర ఎన్విరో' పేరుతో చిన్నగా పరిశ్రమ నెలకొల్పారు. అందుకోసం సొంతగా కొంత మెుత్తంతో పాటు స్నేహితులు, బ్యాంకుల నుంచి రూ.8 కోట్లు పెట్టుబడి రుణాలు తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాలిథిన్‌ వ్యర్థాల నుంచి డీజిల్‌ను ఉత్పత్తి చేసే యంత్రం రూపొందించారు. అలా మొదట రోజుకు 500 కిలోల పాలిథిన్‌ వ్యర్థాలు మరిగించి డీజిల్‌ తయారు చేయటం మెుదలు పెట్టారు.

Making Tiles with Plastic : ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్‌ తయారీ.. ప్రకృతి పరిరక్షణ కోసం యువకుడి కృషి

రోడ్లపై చెత్త ఏరుకునే వాళ్ల నుంచి, వ్యర్థాలను అమ్మే ఏజెంట్ల నుంచి రీసైక్లింగ్‌కు అవకాశం లేని పాలిథిన్, ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొనుగోలు చేసేవాళ్లు. వాటిని రియాక్టర్లలో ఆక్సిజన్‌ లేకుండా వేడి చేస్తే.. పాలిథిన్‌ కరిగి వాయువు రూపంలోకి మారుతుంది. ఆ వాయువును చల్లబరిస్తే డీజిల్‌ తయారవుతుంది. ఇలా రోజుకు 10 టన్నుల పాలిథిన్‌ వ్యర్థాలతో 6000 లీటర్ల డీజిల్‌ను ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్నారు.

విస్తరణకు ప్రణాళికలు..: ప్రస్తుతం రోజుకు పది టన్నుల పాలిథిన్‌ వ్యర్థాలతో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తూ స్వచ్ఛతకు, పర్యావరణానికి మేలు చేస్తున్నారు వీరిద్దరు. ఈ డీజిల్‌ను జనరేటర్లు నడిపేందుకు, ఇతర అవసరాల కోసం పరిశ్రమలకు అమ్ముతున్నారు. రెండేళ్లుగా జరుగుతున్న వీరి వ్యాపారం, ప్రయోగం విజయవంతం కావడంతో విస్తరణకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. దేశంలో ఇంత పెద్దమొత్తంలో పాలిథిన్‌ నుంచి డీజిల్‌ను ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో ఇదే పెద్దది అంటున్నారు.

Plastic Awarness Program: ప్లాస్టిక్ ఇచ్చి సిల్వర్ తీసుకెళ్లండి... ఈ ఆఫర్ ఎక్కడో తెలుసా..?

ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి..: మేకిన్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తితో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం, పరికరాలతో ఈ పరిశ్రమ నెలకొల్పారు రంజిత్, దినేశ్‌. ఈ ఎకో ఫ్రెండ్లీ పరిశ్రమలో స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పాలిథిన్‌ వ్యర్థాలు సేకరించే మరికొంత మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. పురపాలికల్లో, గ్రామ పంచాయతీల్లో సేకరించిన పాలిథిన్‌ వ్యర్థాలతో అక్కడికక్కడే డీజిల్‌ను ఉత్పత్తి చేసే మినీ, సంచార యంత్రాలకు రూపకల్పన చేశారు.

ప్రభుత్వ ప్రశంసలు..: ప్రయోగాత్మకంగా నెలకొల్పిన ఈ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వ పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు చూసి ప్రశంసించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సైతం అభినందించారు. త్వరలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అధికారులకూ వీరి ప్రయోగం గురించి వివరించనున్నారు. ప్రభుత్వం సహకరిస్తే పర్యావరణానికి మేలు చేసే ఈ పరిశ్రమలను దేశమంతటా నెలకొల్పాలనేది ఈ యువ మిత్రుల ఆకాంక్ష.

ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించేందుకే.. 'ఎనీ టైమ్ బ్యాగ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.