యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. మొదటి రోజు ఇద్దరు వ్యక్తులు తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఇక నుంచి అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లోనే జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా సులువుగా అమ్మకందారులు, కొనుగోలుదారులు ఎమ్మార్వో ఆఫీసులో భూముల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. భూమిని కొత్తగా కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌తో పాటు వెంటనే మ్యూటేషన్ కూడా జరుగుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: ఎల్ఆర్ఎస్: రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల 59వేల 562 దరఖాస్తులు