yadadri dhanurmasam utsavalu: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు ఈ నెల 16 నుంచి మొదలవుతాయని ఆలయ ప్రధాన పూజారి డాక్టర్ నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్య తెలిపారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ముగుస్తాయని వెల్లడించారు. సంక్రాంతి పండుగకు ముందస్తుగా చేపట్టే ధనుర్మాసోత్సవాల్లో గోదాదేవి మనోవల్లభుడైన శ్రీరంగనాథుడిని ఆరాధించే పర్వాలు నిర్వహిస్తారు.
బ్రహ్మీకాలంలో అమ్మవారు స్వామివారిని ఆరాధించే పర్వాన్ని పాశుర పఠనం, పొంగళి నివేదనలతో కొనసాగిస్తారు. పునర్ నిర్మితమైన పంచనార సింహుల దివ్యాలయంలో ధనుర్మాసోత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి అని ఆలయ ఈవో గీత చెప్పారు.
ఇవీ చదవండి :