ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు సెలవు కావటంతో భక్తులు కుటుంబ సమేతంగా స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అంతటా భక్తుల సందడి నెలకొంది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు ఆలయ అధికారులు లఘు దర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారి నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొన్నారు. నారసింహుని ధర్మదర్శనానికి 2గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది.
స్వామివారి పూజలో లేబర్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు కొండ కింద తులసి కాటేజ్ వద్ద జరుగుతున్నాయి. కుటుంబ సమేతంగా వ్రత పూజలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. కొండ కిందనే పార్కింగ్ స్థలం కేటాయించారు.
ఇదీ చదవండి: పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజుకు సన్మానం