కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్ దేవస్థానాలను మూసివేయాలని ఆదేశించింది. యాదాద్రి లక్ష్మీ నరసింహుని సన్నిధికి నేటి నుంచి భక్తులను నిలిపివేశారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే వరకు భక్తులను ఆలయంలోనికి అనుమతించబోమని యాడా అధికారులు స్పష్టం చేశారు.
నేటి నుంచి స్వామి వారికి ఏకాంత సేవలో నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు లేక ఆలయ ప్రాంగణమంతా వెలవెలబోయింది. కొండపైకి వెళ్లకుండా కింద ఘాట్‌రోడ్డు వద్దనే భక్తులను నిలిపివేస్తున్నారు.
- ఇదీ చూడండి: కరోనా భయాలతో అయినకాడికి అమ్మేస్తున్నారు