అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జీవన్మృతుడై అవయవదానం చేసిన నర్సిరెడ్డి కుటుంబాన్ని సీపీ పరామర్శించారు. నర్సిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన బాధలోనూ... మరో 8 మంది జీవితాల్లో వెలుగు నింపడం గొప్ప విషయమని నర్సిరెడ్డి కుటుంబాన్ని సీపీ అభినందించారు. ఫిబ్రవరి నెలలో 11 బ్రెయిన్‌డెడ్ కేసులు నమోదు కాగా... జీవన్‌దాన్ ద్వారా అవయవ దానానికి ముందుకొచ్చారని తెలిపారు. గత మూడేళ్లలో 150 మంది అవయవదానం చేశారని తెలిపారు.
ఇదీ చూడండి: నర్సిరెడ్డి కుటుంబానికి శాంతా బయోటెక్ అధినేత సాయం