ETV Bharat / state

'బీజేపీని ఎదుర్కోవడంలో బీఆర్​ఎస్ సక్సెస్.. అందుకే కలిసి ముందుకు' - Tammineni Veerabhadram latest speech

బీజేపీ అప్రజాస్వామిక చట్టాలను ఎదుర్కోవడంలో, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటంలో బీఆర్ఎస్ సఫలం అయిందని.. అందుకే రానున్న కాలంలో ఆ పార్టీతో వెళ్లనున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

Tammineni Veerabhadram  media conference
తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం
author img

By

Published : Jan 13, 2023, 8:26 PM IST

బీజేపీ అప్రజాస్వామిక చట్టాలను ఎదుర్కోవడంలో, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటంలో బీఆర్ఎస్ సఫలం అయిందని.. అందుకే రానున్న కాలంలో ఆ పార్టీతో వెళ్లనున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని తమ్మినేని వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తోందని.. ప్రలోభాలకు పాల్పడుతూ కాంగ్రెస్, బీఆర్​ఎస్​ నుంచి ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటామని అందుకోసం ప్రత్యేకంగా కమిటీ వేసుకోవడం బీజేపీ వ్యభిచార రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.

తమ మాట వినని వారిపై ఈడీ, సీబీఐ పేరిట భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. తాజాగా ఖమ్మంలో ఓ ప్రధాన నాయకుడినీ బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ పార్టీ సిద్దమైందని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక శక్తిగా ఉన్న బీఆర్ఎస్​తో సీపీఐ, సీపీఎం పార్టీలుగా కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించే శక్తి లేదని మునుగోడులో స్పష్టం అయిందని అన్న ఆయన.. బీజేపీకి వ్యతిరేక శక్తిగా బీఆర్​ఎస్​ ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాలు, పోరాటాలు వేర్వేరని మరోసారి ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పార్టీని ఓడించడం తమ ప్రధాన లక్ష్యమని.. దానికోసం ఏ పార్టీకైనా మద్దతిస్తామని స్పష్టం చేశారు.

'తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కాషాయ రాజకీయాలను దరిచేరనీయద్దు. లౌకిక విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంపై బీజేపీ కన్ను వేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడాలని, ప్రజల మన్నన పొందాలని, పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అలానే కాంగ్రెస్​ నాయకులు, బీఆర్​ఎస్​ నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకోవాలని చూస్తోంది. తెలంగాణ రాష్ట్రంపైన, రాష్ట్ర హక్కులపైన బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులు, నిధుల నిరాకరణ రాష్ట్రానికి ఇస్తానన్న ప్రాజెక్టులు ఇవ్వకపోవడం వీటన్నింటి విషయాల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం జరగాలి. దీనికోసమే బీఆర్​ఎస్​తో కలిసి సీపీఐ, సీపీఎం ఆ ప్రయత్నంలో ఉన్నాయి. అదే విధంగా బీఆర్​ఎస్​ పరిపాలన లోపాలు ఉంటే వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేస్తాం.' - తమ్మినేని వీరభద్రం, తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.